|
AND
find keywords in
Home Page
Genesis ఆదికాండము Exodus నిర్గామకాండము Leviticus లేవీకాండము Numbers సంఖ్యాకాండము Deuteronomy ద్వితియోపదేశకాండము Joshua యెహోషువ Judges న్యాయాధిపతులు Ruth రూతు 1 Samuel 1 సమూయేలు 2 Samuel 2 సమూయేలు 1 Kings 1 రాజులు 2 Kings 2 రాజులు 1 Chronicles 1 దినవృత్తాంతములు 2 Chronicles 2 దినవృత్తాంతములు Ezra ఎజ్రా Nehemiah నెహెమ్యా Esther ఎస్తేరు Job యోబు Psalms కీర్తనలు Proverbs సామెతలు Ecclesiastes ప్రసంగి Song of Solomon పరమగీతము Isaiah యెషయా Jeremiah యిర్మియా Lamentations విలాపవాక్యములు Ezekiel యెహేజ్కేలు Daniel దానియేలు Hosea హోషేయా Joel యోవేలు Amos ఆమోసు Obadiah ఓబద్యా Jonah యోనా Micah మీకా Nahum నహూము Habakkuk హబక్కూకు Zephaniah జెఫన్యా Haggai హగ్గయి Zechariah జెకర్యా Malachi మలాకీ Matthew మత్తయి Mark మార్కు Luke లూకా John యోహాను Acts అపో. కార్యములు Romans రోమీయులకు 1 Corinthians 1 కోరింథీయులకు 2 Corinthians 2 కోరింథీయులకు Galatians గలతియులకు Ephesians ఎఫెసీయులకు Philippians ఫిలిప్పీయులకు Colossians కొలస్సీయులకు 1 Thessalonians 1 థెస్సలొనికయులకు 2 Thessalonians 2 థెస్సలొనికయులకు 1 Timothy 1 తిమోతికి 2 Timothy 2 తిమోతికి Titus తీతుకు Philemon ఫిలేమోనుకు Hebrews హెబ్రీయులకు James యాకోబు 1 Peter 1 పేతురు 2 Peter 2 పేతురు 1 John 1 యోహాను 2 John 2 యోహాను 3 John 3 యోహాను Jude యూదా Revelation ప్రకటన గ్రంథం
|
|
|
కీర్తనలు Chapter83 1 దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము. 2 నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు. 3 నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు 4 వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. 5 ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. 6 గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయు లును మోయాబీయులును హగ్రీయీలును 7 గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు. 8 అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.) 9 మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము. 10 వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి. 11 ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. 12 దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు. 13 నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము 14 అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు 15 నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము. 16 యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము. 17 వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక. 18 యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.
|
|
|