|
AND
find keywords in
Home Page
Genesis ఆదికాండము Exodus నిర్గామకాండము Leviticus లేవీకాండము Numbers సంఖ్యాకాండము Deuteronomy ద్వితియోపదేశకాండము Joshua యెహోషువ Judges న్యాయాధిపతులు Ruth రూతు 1 Samuel 1 సమూయేలు 2 Samuel 2 సమూయేలు 1 Kings 1 రాజులు 2 Kings 2 రాజులు 1 Chronicles 1 దినవృత్తాంతములు 2 Chronicles 2 దినవృత్తాంతములు Ezra ఎజ్రా Nehemiah నెహెమ్యా Esther ఎస్తేరు Job యోబు Psalms కీర్తనలు Proverbs సామెతలు Ecclesiastes ప్రసంగి Song of Solomon పరమగీతము Isaiah యెషయా Jeremiah యిర్మియా Lamentations విలాపవాక్యములు Ezekiel యెహేజ్కేలు Daniel దానియేలు Hosea హోషేయా Joel యోవేలు Amos ఆమోసు Obadiah ఓబద్యా Jonah యోనా Micah మీకా Nahum నహూము Habakkuk హబక్కూకు Zephaniah జెఫన్యా Haggai హగ్గయి Zechariah జెకర్యా Malachi మలాకీ Matthew మత్తయి Mark మార్కు Luke లూకా John యోహాను Acts అపో. కార్యములు Romans రోమీయులకు 1 Corinthians 1 కోరింథీయులకు 2 Corinthians 2 కోరింథీయులకు Galatians గలతియులకు Ephesians ఎఫెసీయులకు Philippians ఫిలిప్పీయులకు Colossians కొలస్సీయులకు 1 Thessalonians 1 థెస్సలొనికయులకు 2 Thessalonians 2 థెస్సలొనికయులకు 1 Timothy 1 తిమోతికి 2 Timothy 2 తిమోతికి Titus తీతుకు Philemon ఫిలేమోనుకు Hebrews హెబ్రీయులకు James యాకోబు 1 Peter 1 పేతురు 2 Peter 2 పేతురు 1 John 1 యోహాను 2 John 2 యోహాను 3 John 3 యోహాను Jude యూదా Revelation ప్రకటన గ్రంథం
|
|
|
కీర్తనలు Chapter115 1 మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక 2 వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు? 3 మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు 4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు 5 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు 6 చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు 7 చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. 8 వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు. 9 ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము 10 అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము 11 యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము. 12 యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును 13 పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 14 యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును. 15 భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు. 16 ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు. 17 మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు 18 మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
|
|
|