|
AND
find keywords in
Home Page
Genesis ఆదికాండము Exodus నిర్గామకాండము Leviticus లేవీకాండము Numbers సంఖ్యాకాండము Deuteronomy ద్వితియోపదేశకాండము Joshua యెహోషువ Judges న్యాయాధిపతులు Ruth రూతు 1 Samuel 1 సమూయేలు 2 Samuel 2 సమూయేలు 1 Kings 1 రాజులు 2 Kings 2 రాజులు 1 Chronicles 1 దినవృత్తాంతములు 2 Chronicles 2 దినవృత్తాంతములు Ezra ఎజ్రా Nehemiah నెహెమ్యా Esther ఎస్తేరు Job యోబు Psalms కీర్తనలు Proverbs సామెతలు Ecclesiastes ప్రసంగి Song of Solomon పరమగీతము Isaiah యెషయా Jeremiah యిర్మియా Lamentations విలాపవాక్యములు Ezekiel యెహేజ్కేలు Daniel దానియేలు Hosea హోషేయా Joel యోవేలు Amos ఆమోసు Obadiah ఓబద్యా Jonah యోనా Micah మీకా Nahum నహూము Habakkuk హబక్కూకు Zephaniah జెఫన్యా Haggai హగ్గయి Zechariah జెకర్యా Malachi మలాకీ Matthew మత్తయి Mark మార్కు Luke లూకా John యోహాను Acts అపో. కార్యములు Romans రోమీయులకు 1 Corinthians 1 కోరింథీయులకు 2 Corinthians 2 కోరింథీయులకు Galatians గలతియులకు Ephesians ఎఫెసీయులకు Philippians ఫిలిప్పీయులకు Colossians కొలస్సీయులకు 1 Thessalonians 1 థెస్సలొనికయులకు 2 Thessalonians 2 థెస్సలొనికయులకు 1 Timothy 1 తిమోతికి 2 Timothy 2 తిమోతికి Titus తీతుకు Philemon ఫిలేమోనుకు Hebrews హెబ్రీయులకు James యాకోబు 1 Peter 1 పేతురు 2 Peter 2 పేతురు 1 John 1 యోహాను 2 John 2 యోహాను 3 John 3 యోహాను Jude యూదా Revelation ప్రకటన గ్రంథం
|
|
|
కీర్తనలు Chapter144 1 నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు. 2 ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు. 3 యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటి వారు? 4 నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు వారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి. 5 యెహోవా, నీ ఆకాశమును వంచి దిగి రమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము 6 మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. 7 పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము. 8 వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది. 9 దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. 10 నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గమునుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు 11 నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్నువిడి పింపుము వారి నోరు వట్టి మాటలాడుచున్నది వారి కుడిచేయి అబద్ధముతో కూడియున్నది. 12 మా కుమారులు తమ ¸°వన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు. 13 మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. 14 మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుట యైనను లేదు వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు 15 ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.
|
|
|