|
AND
find keywords in
Home Page
Genesis ఆదికాండము Exodus నిర్గామకాండము Leviticus లేవీకాండము Numbers సంఖ్యాకాండము Deuteronomy ద్వితియోపదేశకాండము Joshua యెహోషువ Judges న్యాయాధిపతులు Ruth రూతు 1 Samuel 1 సమూయేలు 2 Samuel 2 సమూయేలు 1 Kings 1 రాజులు 2 Kings 2 రాజులు 1 Chronicles 1 దినవృత్తాంతములు 2 Chronicles 2 దినవృత్తాంతములు Ezra ఎజ్రా Nehemiah నెహెమ్యా Esther ఎస్తేరు Job యోబు Psalms కీర్తనలు Proverbs సామెతలు Ecclesiastes ప్రసంగి Song of Solomon పరమగీతము Isaiah యెషయా Jeremiah యిర్మియా Lamentations విలాపవాక్యములు Ezekiel యెహేజ్కేలు Daniel దానియేలు Hosea హోషేయా Joel యోవేలు Amos ఆమోసు Obadiah ఓబద్యా Jonah యోనా Micah మీకా Nahum నహూము Habakkuk హబక్కూకు Zephaniah జెఫన్యా Haggai హగ్గయి Zechariah జెకర్యా Malachi మలాకీ Matthew మత్తయి Mark మార్కు Luke లూకా John యోహాను Acts అపో. కార్యములు Romans రోమీయులకు 1 Corinthians 1 కోరింథీయులకు 2 Corinthians 2 కోరింథీయులకు Galatians గలతియులకు Ephesians ఎఫెసీయులకు Philippians ఫిలిప్పీయులకు Colossians కొలస్సీయులకు 1 Thessalonians 1 థెస్సలొనికయులకు 2 Thessalonians 2 థెస్సలొనికయులకు 1 Timothy 1 తిమోతికి 2 Timothy 2 తిమోతికి Titus తీతుకు Philemon ఫిలేమోనుకు Hebrews హెబ్రీయులకు James యాకోబు 1 Peter 1 పేతురు 2 Peter 2 పేతురు 1 John 1 యోహాను 2 John 2 యోహాను 3 John 3 యోహాను Jude యూదా Revelation ప్రకటన గ్రంథం
|
|
|
కీర్తనలు Chapter76 1 యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. 2 షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది. 3 అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.) 4 దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు. 5 కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. 6 యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను. 7 నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? 8 నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి 9 దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.(సెలా.) 10 నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు. 11 మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. 12 అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.
|
|
|