|
AND
find keywords in
Home Page
Genesis ఆదికాండము Exodus నిర్గామకాండము Leviticus లేవీకాండము Numbers సంఖ్యాకాండము Deuteronomy ద్వితియోపదేశకాండము Joshua యెహోషువ Judges న్యాయాధిపతులు Ruth రూతు 1 Samuel 1 సమూయేలు 2 Samuel 2 సమూయేలు 1 Kings 1 రాజులు 2 Kings 2 రాజులు 1 Chronicles 1 దినవృత్తాంతములు 2 Chronicles 2 దినవృత్తాంతములు Ezra ఎజ్రా Nehemiah నెహెమ్యా Esther ఎస్తేరు Job యోబు Psalms కీర్తనలు Proverbs సామెతలు Ecclesiastes ప్రసంగి Song of Solomon పరమగీతము Isaiah యెషయా Jeremiah యిర్మియా Lamentations విలాపవాక్యములు Ezekiel యెహేజ్కేలు Daniel దానియేలు Hosea హోషేయా Joel యోవేలు Amos ఆమోసు Obadiah ఓబద్యా Jonah యోనా Micah మీకా Nahum నహూము Habakkuk హబక్కూకు Zephaniah జెఫన్యా Haggai హగ్గయి Zechariah జెకర్యా Malachi మలాకీ Matthew మత్తయి Mark మార్కు Luke లూకా John యోహాను Acts అపో. కార్యములు Romans రోమీయులకు 1 Corinthians 1 కోరింథీయులకు 2 Corinthians 2 కోరింథీయులకు Galatians గలతియులకు Ephesians ఎఫెసీయులకు Philippians ఫిలిప్పీయులకు Colossians కొలస్సీయులకు 1 Thessalonians 1 థెస్సలొనికయులకు 2 Thessalonians 2 థెస్సలొనికయులకు 1 Timothy 1 తిమోతికి 2 Timothy 2 తిమోతికి Titus తీతుకు Philemon ఫిలేమోనుకు Hebrews హెబ్రీయులకు James యాకోబు 1 Peter 1 పేతురు 2 Peter 2 పేతురు 1 John 1 యోహాను 2 John 2 యోహాను 3 John 3 యోహాను Jude యూదా Revelation ప్రకటన గ్రంథం
|
|
|
సామెతలు Chapter17 1 రుచియైన భోజన పదార్థములున్నను కలహముతో కూడియుండిన ఇంటనుండుటకంటె నెమ్మది కలిగియుండి వట్టి రొట్టెముక్క తినుట మేలు. 2 బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచు కొనును. 3 వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. 4 చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధి కుడు చెవియొగ్గును. 5 బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించు వాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచ బడడు. 6 కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారము. 7 అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. 8 లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవ ర్తించును. 9 ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. 10 బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును. 11 తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును. 12 పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంటిని ఎదుర్కొన వచ్చును గాని మూర్ఖపుపనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొన రాదు 13 మేలుకు ప్రతిగా కీడు చేయువాని యింటనుండి కీడు తొలగిపోదు. 14 కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు 15 నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు. 16 బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండ నేల? వానికి బుద్ధి లేదు గదా? 17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. 18 తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు. 19 కలహప్రియుడు దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనము వెదకువాడు. 20 కుటిలవర్తనుడు మేలుపొందడు మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. 21 బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు. 22 సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. 23 న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచము పుచ్చుకొనును. 24 జ్ఞానము వివేకముగలవాని యెదుటనే యున్నది బుద్ధిహీనువి కన్నులు భూదిగంతములలో ఉండును. 25 బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును 26 నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతనుబట్టి మంచివారిని హతము చేయుటే. 27 మితముగా మాటలాడువాడు తెలివిగలవాడు శాంతగుణముగలవాడు వివేకముగలవాడు. 28 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండినయెడల జ్ఞాని అని యెంచబడును అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.
|
|
|