Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
Genesis
ఆదికాండము
Exodus
నిర్గామకాండము
Leviticus
లేవీకాండము
Numbers
సంఖ్యాకాండము
Deuteronomy
ద్వితియోపదేశకాండము
Joshua
యెహోషువ
Judges
న్యాయాధిపతులు
Ruth
రూతు
1 Samuel
1 సమూయేలు
2 Samuel
2 సమూయేలు
1 Kings
1 రాజులు
2 Kings
2 రాజులు
1 Chronicles
1 దినవృత్తాంతములు
2 Chronicles
2 దినవృత్తాంతములు
Ezra
ఎజ్రా
Nehemiah
నెహెమ్యా
Esther
ఎస్తేరు 
Job
యోబు
Psalms
కీర్తనలు
Proverbs
సామెతలు
Ecclesiastes
ప్రసంగి
Song of Solomon
పరమగీతము
Isaiah
యెషయా
Jeremiah
యిర్మియా
Lamentations
విలాపవాక్యములు
Ezekiel
యెహేజ్కేలు
Daniel
దానియేలు
Hosea
హోషేయా
Joel
యోవేలు
Amos
ఆమోసు
Obadiah
ఓబద్యా
Jonah
యోనా
Micah
మీకా
Nahum
నహూము
Habakkuk
హబక్కూకు
Zephaniah
జెఫన్యా 
Haggai
హగ్గయి
Zechariah
జెకర్యా
Malachi
మలాకీ 
Matthew
మత్తయి
Mark
మార్కు
Luke
లూకా 
John
యోహాను
Acts
అపో. కార్యములు
Romans
రోమీయులకు
1 Corinthians
1 కోరింథీయులకు 
2 Corinthians
2 కోరింథీయులకు
Galatians
గలతియులకు
Ephesians
ఎఫెసీయులకు
Philippians
ఫిలిప్పీయులకు
Colossians
కొలస్సీయులకు
1 Thessalonians
1 థెస్సలొనికయులకు 
2 Thessalonians
2 థెస్సలొనికయులకు
1 Timothy
1 తిమోతికి
2 Timothy
2 తిమోతికి
Titus
తీతుకు
Philemon
ఫిలేమోనుకు
Hebrews
హెబ్రీయులకు
James
యాకోబు
1 Peter
1 పేతురు
2 Peter
2 పేతురు
1 John
1 యోహాను
2 John
2 యోహాను
3 John
3 యోహాను
Jude
యూదా
Revelation
ప్రకటన గ్రంథం
 
 

 
 
translate into
యోహాను Chapter1
 
1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
 
2 ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,
 
3 కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.
 
4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
 
5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.
 
6 దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.
 
7 అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను.
 
8 అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.
 
9 నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
 
10 ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.
 
11 ఆయన తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
 
12 తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
 
13 వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.
 
14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
 
15 యోహాను ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచునా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను.
 
16 ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితివిు.
 
17 ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
 
18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను.
 
19 నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే.
 
20 అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును కానని ఒప్పుకొనెను.
 
21 కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు కాననెను.
 
22 నీవు ఆ ప్రవక్తవా అని అడుగగాకానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారునీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి
 
23 అందు కతడుప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను.
 
24 పంపబడినవారు పరిసయ్యులకు చెందిన వారు
 
25 వారు నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా
 
26 యోహాను నేను నీళ్లలో బాప్తి స్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;
 
27 మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను.
 
28 యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.
 
29 మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచిఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.
 
30 నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన.
 
31 నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను.
 
32 మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను.
 
33 నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలొ బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడునీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను.
 
34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చి తిననెను.
 
35 మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా
 
36 అతడు నడుచుచున్న యేసు వైపు చూచిఇదిగో దేవుని గొఱ్ఱపిల్ల అని చెప్పెను.
 
37 అతడు చెప్పినమాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.
 
38 యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబ డించుట చూచిమీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారురబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్థము.
 
39 వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను.
 
40 యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.
 
41 ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచిమేము మెస్సీయను కనుగొంటి మని అతనితో చెప్పి
 
42 యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచినీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.
 
43 మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొనినన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.
 
44 ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు.
 
45 ఫిలిప్పు నతనయేలును కనుగొనిధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.
 
46 అందుకు నతనయేలునజ రేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.
 
47 యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచిఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను.
 
48 నన్ను నీవు ఏలాగు ఎరుగుదు వని నతనయేలు ఆయనను అడుగగా యేసుఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను.
 
49 నతన యేలుబోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.
 
50 అందుకు యేసుఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను.
 
51 మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుట యును చూతురని మీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.
 
 

  | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | [ Next ]