Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
ఆదికాండము
Genesis
నిర్గామకాండము
Exodus
లేవీకాండము
Leviticus
సంఖ్యాకాండము
Numbers
ద్వితియోపదేశకాండము
Deuteronomy
యెహోషువ
Joshua
న్యాయాధిపతులు
Judges
రూతు
Ruth
1 సమూయేలు
1 Samuel
2 సమూయేలు
2 Samuel
1 రాజులు
1 Kings
2 రాజులు
2 Kings
1 దినవృత్తాంతములు
1 Chronicles
2 దినవృత్తాంతములు
2 Chronicles
ఎజ్రా
Ezra
నెహెమ్యా
Nehemiah
ఎస్తేరు 
Esther
యోబు
Job
కీర్తనలు
Psalms
సామెతలు
Proverbs
ప్రసంగి
Ecclesiastes
పరమగీతము
Song of Solomon
యెషయా
Isaiah
యిర్మియా
Jeremiah
విలాపవాక్యములు
Lamentations
యెహేజ్కేలు
Ezekiel
దానియేలు
Daniel
హోషేయా
Hosea
యోవేలు
Joel
ఆమోసు
Amos
ఓబద్యా
Obadiah
యోనా
Jonah
మీకా
Micah
నహూము
Nahum
హబక్కూకు
Habakkuk
జెఫన్యా 
Zephaniah
హగ్గయి
Haggai
జెకర్యా
Zechariah
మలాకీ 
Malachi
మత్తయి
Matthew
మార్కు
Mark
లూకా 
Luke
యోహాను
John
అపో. కార్యములు
Acts
రోమీయులకు
Romans
1 కోరింథీయులకు 
1 Corinthians
2 కోరింథీయులకు
2 Corinthians
గలతియులకు
Galatians
ఎఫెసీయులకు
Ephesians
ఫిలిప్పీయులకు
Philippians
కొలస్సీయులకు
Colossians
1 థెస్సలొనికయులకు 
1 Thessalonians
2 థెస్సలొనికయులకు
2 Thessalonians
1 తిమోతికి
1 Timothy
2 తిమోతికి
2 Timothy
తీతుకు
Titus
ఫిలేమోనుకు
Philemon
హెబ్రీయులకు
Hebrews
యాకోబు
James
1 పేతురు
1 Peter
2 పేతురు
2 Peter
1 యోహాను
1 John
2 యోహాను
2 John
3 యోహాను
3 John
యూదా
Jude
ప్రకటన గ్రంథం
Revelation
 
 

 
 
translate into
దానియేలు Chapter1
 
1 యూదారాజగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోనురాజగు నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చి దాని ముట్టడివేయగా
 
2 ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతా లయపు బొక్కసములో ఉంచెను.
 
3 రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెనుఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,
 
4 తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.
 
5 మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండియు తాను పానముచేయు ద్రాక్షారసములో నుండియు అనుదిన భాగము వారికి నియమించి, మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యెదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను.
 
6 యూదులలోనుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలోనుండిరి.
 
7 నపుంస కుల యధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హన న్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజ ర్యాకు అబేద్నెగో అనియు పేళ్లు పెట్టెను.
 
8 రాజు భుజించు భోజనమును పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండ సెలవిమ్మని నపుంసకుల యధిపతిని వేడు కొనగా
 
9 దేవుడు నపుంసకుల యధిపతి దృష్టికి దానియేలు నకు కృపాకటాక్షమునొంద ననుగ్రహించెను గనుక నపుంసకుల యధిపతి దానియేలుతో ఇట్లనెను
 
10 మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.
 
11 నపుంసకుల యధిపతి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారిమీద నియమించిన నియామ కునితో దానియేలు ఇట్లనెను.
 
12 భోజనమునకు శాకధాన్యా దులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి, దయచేసి పది దినములవరకు మమ్మును పరీక్షింపుము.
 
13 పిమ్మట మా ముఖములను, రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మాయెడల జరిగింపుము.
 
14 అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి పది దినములవరకు వారిని పరీక్షించెను.
 
15 పది దినములైన పిమ్మట వారి ముఖ ములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటె సౌందర్యముగాను కళగాను కనబడగా
 
16 రాజు వారికి నియమించిన భోజనమును పానముకొరకైన ద్రాక్షా రసమును ఆ నియామకుడు తీసివేసి, వారికి శాకధాన్యా దుల నిచ్చెను.
 
17 ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రప్రవీణతయు వివే చనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్నభావములను గ్రహించు తెలివిగలవాడై యుండెను.
 
18 నెబుకద్నెజరు తన సముఖ మునకు వారిని తేవలెనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల యధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను.
 
19 రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటివారెవ రును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి.
 
20 రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధ మైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్య గలవారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.
 
21 ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమువరకు జీవించెను.
 
 

  | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | [ Next ]