Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
ఆదికాండము
Genesis
నిర్గామకాండము
Exodus
లేవీకాండము
Leviticus
సంఖ్యాకాండము
Numbers
ద్వితియోపదేశకాండము
Deuteronomy
యెహోషువ
Joshua
న్యాయాధిపతులు
Judges
రూతు
Ruth
1 సమూయేలు
1 Samuel
2 సమూయేలు
2 Samuel
1 రాజులు
1 Kings
2 రాజులు
2 Kings
1 దినవృత్తాంతములు
1 Chronicles
2 దినవృత్తాంతములు
2 Chronicles
ఎజ్రా
Ezra
నెహెమ్యా
Nehemiah
ఎస్తేరు 
Esther
యోబు
Job
కీర్తనలు
Psalms
సామెతలు
Proverbs
ప్రసంగి
Ecclesiastes
పరమగీతము
Song of Solomon
యెషయా
Isaiah
యిర్మియా
Jeremiah
విలాపవాక్యములు
Lamentations
యెహేజ్కేలు
Ezekiel
దానియేలు
Daniel
హోషేయా
Hosea
యోవేలు
Joel
ఆమోసు
Amos
ఓబద్యా
Obadiah
యోనా
Jonah
మీకా
Micah
నహూము
Nahum
హబక్కూకు
Habakkuk
జెఫన్యా 
Zephaniah
హగ్గయి
Haggai
జెకర్యా
Zechariah
మలాకీ 
Malachi
మత్తయి
Matthew
మార్కు
Mark
లూకా 
Luke
యోహాను
John
అపో. కార్యములు
Acts
రోమీయులకు
Romans
1 కోరింథీయులకు 
1 Corinthians
2 కోరింథీయులకు
2 Corinthians
గలతియులకు
Galatians
ఎఫెసీయులకు
Ephesians
ఫిలిప్పీయులకు
Philippians
కొలస్సీయులకు
Colossians
1 థెస్సలొనికయులకు 
1 Thessalonians
2 థెస్సలొనికయులకు
2 Thessalonians
1 తిమోతికి
1 Timothy
2 తిమోతికి
2 Timothy
తీతుకు
Titus
ఫిలేమోనుకు
Philemon
హెబ్రీయులకు
Hebrews
యాకోబు
James
1 పేతురు
1 Peter
2 పేతురు
2 Peter
1 యోహాను
1 John
2 యోహాను
2 John
3 యోహాను
3 John
యూదా
Jude
ప్రకటన గ్రంథం
Revelation
 
 

 
 
translate into
2 సమూయేలు Chapter1
 
1 దావీదు అమాలేకీయులను హతముచేసి తిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను.
 
2 మూడవ దినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్న దండులోనుండి వచ్చెను.
 
3 అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదునీ వెక్కడనుండి వచ్చితివని యడి గెను. అందుకు వాడుఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను.
 
4 జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడుజనులు యుద్ధమందు నిలువ లేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను.
 
5 సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వాని నడుగగా వాడిట్లనెను
 
6 గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను.
 
7 అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకుచిత్తము నా యేలినవాడా అని నేనంటిని.
 
8 నీవెవడవని అతడు నన్నడుగగానేను అమాలేకీయుడనని చెప్పితిని.
 
9 అతడునా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను ? నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా,
 
10 ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణము లను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.
 
11 దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్ద నున్న వారందరును ఆలాగున చేసి
 
12 సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి.
 
13 తరువాత దావీదునీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవాని నడుగగా వాడునేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను.
 
14 అందుకు దావీదుభయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి?
 
15 యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే;
 
16 నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచినీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.
 
17 యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను.
 
18 అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా
 
19 ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారునీ ఉన్నత స్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి.
 
20 ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లుఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి.
 
21 గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైననులేకపోవును గాక.బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను.తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టుసౌలు డాలును పారవేయబడెను.
 
22 హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండయోనాతాను విల్లు వెనుకతియ్యలేదుఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు.
 
23 సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులు గాను నెనరుగల వారుగాను ఉండిరితమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారువారు పక్షిరాజులకంటె వడిగలవారుసింహములకంటె బలముగలవారు.
 
24 ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడుబంగారు నగలు మీకు పెట్టినవాడు.
 
25 యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారునీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను.
 
26 నా సహోదరుడా, యోనాతానానీవు నాకు అతిమనోహరుడవై యుంటివినీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నానునాయందు నీకున్న ప్రేమ బహు వింతైనదిస్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.
 
27 అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరియుద్ధసన్నద్ధులు నశించిపోయిరి.
 
 

  | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | [ Next ]