Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
Genesis
ఆదికాండము
Exodus
నిర్గామకాండము
Leviticus
లేవీకాండము
Numbers
సంఖ్యాకాండము
Deuteronomy
ద్వితియోపదేశకాండము
Joshua
యెహోషువ
Judges
న్యాయాధిపతులు
Ruth
రూతు
1 Samuel
1 సమూయేలు
2 Samuel
2 సమూయేలు
1 Kings
1 రాజులు
2 Kings
2 రాజులు
1 Chronicles
1 దినవృత్తాంతములు
2 Chronicles
2 దినవృత్తాంతములు
Ezra
ఎజ్రా
Nehemiah
నెహెమ్యా
Esther
ఎస్తేరు 
Job
యోబు
Psalms
కీర్తనలు
Proverbs
సామెతలు
Ecclesiastes
ప్రసంగి
Song of Solomon
పరమగీతము
Isaiah
యెషయా
Jeremiah
యిర్మియా
Lamentations
విలాపవాక్యములు
Ezekiel
యెహేజ్కేలు
Daniel
దానియేలు
Hosea
హోషేయా
Joel
యోవేలు
Amos
ఆమోసు
Obadiah
ఓబద్యా
Jonah
యోనా
Micah
మీకా
Nahum
నహూము
Habakkuk
హబక్కూకు
Zephaniah
జెఫన్యా 
Haggai
హగ్గయి
Zechariah
జెకర్యా
Malachi
మలాకీ 
Matthew
మత్తయి
Mark
మార్కు
Luke
లూకా 
John
యోహాను
Acts
అపో. కార్యములు
Romans
రోమీయులకు
1 Corinthians
1 కోరింథీయులకు 
2 Corinthians
2 కోరింథీయులకు
Galatians
గలతియులకు
Ephesians
ఎఫెసీయులకు
Philippians
ఫిలిప్పీయులకు
Colossians
కొలస్సీయులకు
1 Thessalonians
1 థెస్సలొనికయులకు 
2 Thessalonians
2 థెస్సలొనికయులకు
1 Timothy
1 తిమోతికి
2 Timothy
2 తిమోతికి
Titus
తీతుకు
Philemon
ఫిలేమోనుకు
Hebrews
హెబ్రీయులకు
James
యాకోబు
1 Peter
1 పేతురు
2 Peter
2 పేతురు
1 John
1 యోహాను
2 John
2 యోహాను
3 John
3 యోహాను
Jude
యూదా
Revelation
ప్రకటన గ్రంథం
 
 

 
 
translate into
యోహాను Chapter11
 
1 మరియ, ఆమె సహోదరియైన మార్త, అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి యాయెను.
 
2 ఈ లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
 
3 అతని అక్క చెల్లెండ్రుప్రభువా, యిదిగో నీవు ప్రేమించువాడు రోగియై యున్నాడని ఆయనయొద్దకు వర్తమానము పంపిరి.
 
4 యేసు అది వినియీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.
 
5 యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
 
6 అతడు రోగియై యున్నాడని యేసు వినినప్పుడు తానున్నచోటనే యింక రెండు దినములు నిలిచెను.
 
7 అటుపిమ్మట ఆయనమనము యూదయకు తిరిగి వెళ్లుదమని తన శిష్యులతో చెప్పగా
 
8 ఆయన శిష్యులుబోధకుడా, యిప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే; అక్కడికి తిరిగి వెళ్లుదువా అని ఆయన నడిగిరి.
 
9 అందుకు యేసుపగలు పండ్రెండు గంటలున్నవి గదా, ఒకడు పగటివేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రు పడడు.
 
10 అయితే రాత్రివేళ ఒకడు నడిచినయెడల వానియందు వెలుగులేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను.
 
11 ఆయన యీ మాటలు చెప్పిన తరువాతమన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలు కొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా
 
12 శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.
 
13 యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి.
 
14 కావున యేసు లాజరు చనిపోయెను,
 
15 మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను; అయినను అతనియొద్దకు మనము వెళ్లుదము రండని స్పష్టముగా వారితో చెప్పెను.
 
16 అందుకు దిదుమ అనబడిన తోమాఆయనతో కూడ చనిపోవుటకు మన మును వెళ్లుదమని తనతోడి శిష్యులతో చెప్పెను.
 
17 యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను.
 
18 బేతనియ యెరూష లేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము
 
19 గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి.
 
20 మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను.
 
21 మార్త యేసుతోప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును.
 
22 ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను.
 
23 యేసు నీ సహో దరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా
 
24 మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.
 
25 అందుకు యేసుపునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;
 
26 బ్రదికి నాయందు విశ్వాస ముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను.
 
27 ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
 
28 ఆమె ఈ మాట చెప్పి వెళ్లిబోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్య ముగా పిలిచెను.
 
29 ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను.
 
30 యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను
 
31 గనుక యింటిలో మరియతో కూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి.
 
32 అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడిప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండు ననెను.
 
33 ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా,
 
34 వారుప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి.
 
35 యేసు కన్నీళ్లు విడిచెను.
 
36 కాబట్టి యూదులు అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి.
 
37 వారిలో కొందరుఆ గ్రుడ్డి వాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి.
 
38 యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను.
 
39 యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్తప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను.
 
40 అందుకు యేసు నీవు నమి్మనయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;
 
41 అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
 
42 నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను.
 
43 ఆయన ఆలాగు చెప్పిలాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా
 
44 చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.
 
45 కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
 
46 వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి యేసుచేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి.
 
47 కాబట్టి ప్రధానయాజకులును పరిసయ్యులును మహా సభను సమకూర్చిమనమేమి చేయుచున్నాము? ఈ మను ష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే.
 
48 మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్ర మించుకొందురని చెప్పిరి.
 
49 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండిమీ కేమియు తెలియదు.
 
50 మన జనమంతయు నశింప కుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను.
 
51 తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక
 
52 యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.
 
53 కాగా ఆ దినమునుండి వారు ఆయనను చంప నాలో చించుచుండిరి.
 
54 కాబట్టి యేసు అప్పటినుండి యూదులలో బహిరంగ ముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతోకూడ ఉండెను.
 
55 మరియు యూదుల పస్కాపండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మునుతాము శుద్ధిచేసికొనుటకై పస్కా రాకమునుపే పల్లె టూళ్లలోనుండి యెరూషలేమునకు వచ్చిరి.
 
56 వారు యేసును వెదకుచు దేవాలయములో నిలువబడిమీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా యేమి? అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.
 
57 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన ఎక్కడ ఉన్నది ఎవనికైనను తెలిసియున్న యెడల తాము ఆయనను పట్టుకొన గలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి యుండిరి.
 
 

  [ Prev ] 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | [ Next ]