Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
Genesis
ఆదికాండము
Exodus
నిర్గామకాండము
Leviticus
లేవీకాండము
Numbers
సంఖ్యాకాండము
Deuteronomy
ద్వితియోపదేశకాండము
Joshua
యెహోషువ
Judges
న్యాయాధిపతులు
Ruth
రూతు
1 Samuel
1 సమూయేలు
2 Samuel
2 సమూయేలు
1 Kings
1 రాజులు
2 Kings
2 రాజులు
1 Chronicles
1 దినవృత్తాంతములు
2 Chronicles
2 దినవృత్తాంతములు
Ezra
ఎజ్రా
Nehemiah
నెహెమ్యా
Esther
ఎస్తేరు 
Job
యోబు
Psalms
కీర్తనలు
Proverbs
సామెతలు
Ecclesiastes
ప్రసంగి
Song of Solomon
పరమగీతము
Isaiah
యెషయా
Jeremiah
యిర్మియా
Lamentations
విలాపవాక్యములు
Ezekiel
యెహేజ్కేలు
Daniel
దానియేలు
Hosea
హోషేయా
Joel
యోవేలు
Amos
ఆమోసు
Obadiah
ఓబద్యా
Jonah
యోనా
Micah
మీకా
Nahum
నహూము
Habakkuk
హబక్కూకు
Zephaniah
జెఫన్యా 
Haggai
హగ్గయి
Zechariah
జెకర్యా
Malachi
మలాకీ 
Matthew
మత్తయి
Mark
మార్కు
Luke
లూకా 
John
యోహాను
Acts
అపో. కార్యములు
Romans
రోమీయులకు
1 Corinthians
1 కోరింథీయులకు 
2 Corinthians
2 కోరింథీయులకు
Galatians
గలతియులకు
Ephesians
ఎఫెసీయులకు
Philippians
ఫిలిప్పీయులకు
Colossians
కొలస్సీయులకు
1 Thessalonians
1 థెస్సలొనికయులకు 
2 Thessalonians
2 థెస్సలొనికయులకు
1 Timothy
1 తిమోతికి
2 Timothy
2 తిమోతికి
Titus
తీతుకు
Philemon
ఫిలేమోనుకు
Hebrews
హెబ్రీయులకు
James
యాకోబు
1 Peter
1 పేతురు
2 Peter
2 పేతురు
1 John
1 యోహాను
2 John
2 యోహాను
3 John
3 యోహాను
Jude
యూదా
Revelation
ప్రకటన గ్రంథం
 
 

 
 
translate into
యోబు Chapter5
 
1 నీవు మొరలిడినయెడల నీకు ఉత్తరమీయగలవాడెవడైన నుండునా? పరిశుద్దదూతలలో ఎవనితట్టు తిరుగుదువు?
 
2 దౌర్భాగ్యమునుగూర్చి యేడ్చుటవలన మూఢులు నశిం చెదరు బుద్ధిలేనివారు అసూయవలన చచ్చెదరు.
 
3 మూఢుడు వేరు తన్నుట నేను చూచియున్నాను అయినను తోడనే అతని నివాసస్థలము శాపగ్రస్తమనికనుగొంటిని.
 
4 అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురుగుమ్మములో నలిగిపోవుదురువారిని విడిపించువాడెవడును లేడు.
 
5 ఆకలిగొనినవారు అతని పంటను తినివేయుదురుముండ్ల చెట్లలోనుండియు వారు దాని తీసికొందురుబోనులు వారి ఆస్తికొరకు కాచుకొనుచున్నవి
 
6 శ్రమ ధూళిలోనుండి పుట్టదు.బాధ భూమిలోనుండి మొలవదు.
 
7 నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవము నకే పుట్టుచున్నారు.
 
8 అయితే నేను దేవుని నాశ్రయించుదును.దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును.
 
9 ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
 
10 ఆయన భూమిమీద వర్షము కురిపించువాడుపొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.
 
11 అట్లు ఆయన దీనులను ఉన్నతస్థలములలో నుంచునుదుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తును.
 
12 వంచకులు తమ పన్నాగములను నెరవేర్చ నేరకుండఆయన వారి ఉపాయములను భంగపరచును
 
13 జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనునుకపటుల ఆలోచనను తలక్రిందుచేయును
 
14 పగటివేళ వారికి అంధకారము తారసిల్లునురాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్నకాలమునవారు తడువులాడుదురు
 
15 బలాఢ్యుల నోటి ఖడ్గమునుండి, వారి చేతిలోనుండిఆయన దరిద్రులను రక్షించును.
 
16 కావున బీదలకు నిరీక్షణ కలుగును అక్రమము నోరు మూసికొనును.
 
17 దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడుకాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము.
 
18 ఆయన గాయపరచి గాయమును కట్టునుఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును.
 
19 ఆరు బాధలలోనుండి ఆయన నిన్ను విడిపించునుఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు.
 
20 క్షామకాలమున మరణమునుండియు యుద్ధమున ఖడ్గబలమునుండియు ఆయన నిన్ను తప్పించును.
 
21 నోటిమాటలచేత కలుగు నొప్పి నీకు తగులకుండ ఆయన నిన్ను చాటుచేయునుప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు.
 
22 పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసికొని యుందువు అడవిమృగములు నీతో సమ్మతిగా నుండును.
 
23 ప్రళయమును క్షామమును వచ్చునప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు అడవిమృగములకు నీవు ఏమాత్రమును భయపడవు
 
24 నీ డేరా క్షేమనివాసమని నీకు తెలిసియుండునునీ యింటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి యుండదు.
 
25 మరియు నీ సంతానము విస్తారమగుననియునీ కుటుంబికులు భూమిమీద పచ్చికవలె విస్తరించుదురనియు నీకు తెలియును.
 
26 వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లుపూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
 
27 మేము ఈ సంగతి పరిశోధించి చూచితివిు, అది ఆలాగే యున్నది.
 
 

  [ Prev ] 1 | 2 | 3 | 4 | | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | [ Next ]