Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
Genesis
ఆదికాండము
Exodus
నిర్గామకాండము
Leviticus
లేవీకాండము
Numbers
సంఖ్యాకాండము
Deuteronomy
ద్వితియోపదేశకాండము
Joshua
యెహోషువ
Judges
న్యాయాధిపతులు
Ruth
రూతు
1 Samuel
1 సమూయేలు
2 Samuel
2 సమూయేలు
1 Kings
1 రాజులు
2 Kings
2 రాజులు
1 Chronicles
1 దినవృత్తాంతములు
2 Chronicles
2 దినవృత్తాంతములు
Ezra
ఎజ్రా
Nehemiah
నెహెమ్యా
Esther
ఎస్తేరు 
Job
యోబు
Psalms
కీర్తనలు
Proverbs
సామెతలు
Ecclesiastes
ప్రసంగి
Song of Solomon
పరమగీతము
Isaiah
యెషయా
Jeremiah
యిర్మియా
Lamentations
విలాపవాక్యములు
Ezekiel
యెహేజ్కేలు
Daniel
దానియేలు
Hosea
హోషేయా
Joel
యోవేలు
Amos
ఆమోసు
Obadiah
ఓబద్యా
Jonah
యోనా
Micah
మీకా
Nahum
నహూము
Habakkuk
హబక్కూకు
Zephaniah
జెఫన్యా 
Haggai
హగ్గయి
Zechariah
జెకర్యా
Malachi
మలాకీ 
Matthew
మత్తయి
Mark
మార్కు
Luke
లూకా 
John
యోహాను
Acts
అపో. కార్యములు
Romans
రోమీయులకు
1 Corinthians
1 కోరింథీయులకు 
2 Corinthians
2 కోరింథీయులకు
Galatians
గలతియులకు
Ephesians
ఎఫెసీయులకు
Philippians
ఫిలిప్పీయులకు
Colossians
కొలస్సీయులకు
1 Thessalonians
1 థెస్సలొనికయులకు 
2 Thessalonians
2 థెస్సలొనికయులకు
1 Timothy
1 తిమోతికి
2 Timothy
2 తిమోతికి
Titus
తీతుకు
Philemon
ఫిలేమోనుకు
Hebrews
హెబ్రీయులకు
James
యాకోబు
1 Peter
1 పేతురు
2 Peter
2 పేతురు
1 John
1 యోహాను
2 John
2 యోహాను
3 John
3 యోహాను
Jude
యూదా
Revelation
ప్రకటన గ్రంథం
 
 

 
 
translate into
యెహేజ్కేలు Chapter18
 
1 మరల యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
 
2 తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని మీరు చెప్పుచు వచ్చెదరే; ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ఈ సామెత మీ రెందుకు పలికెదరు?
 
3 నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలీయులలో మీరిక పలుకరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
 
4 మనుష్యులందరు నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరును నా వశ ములో ఉన్నారు; పాపముచేయువాడెవడో వాడే మరణము నొందును.
 
5 ఒకడు నీతిపరుడై నీతిన్యాయములను అనుసరించువాడైయుండి
 
6 పర్వతములమీద భోజనము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరపకయు, బహిష్టయైనదానిని కూడకయు,
 
7 ఎవనినైనను భాదపెట్ట కయు, ఋణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలా త్కారముచేత ఎవనికైనను నష్టము కలుగజేయకయునుండు వాడై, ఆకలిగల వానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి
 
8 వడ్డికి అప్పియ్యకయు, లాభము చేపట్టకయు, అన్యాయము చేయకయు, నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి
 
9 యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధుల నను సరించుచుండినయెడల వాడే నిర్దోషియగును, నిజ ముగా వాడు బ్రదుకును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
 
10 అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారము చేయువాడై ప్రాణహానికరుడై, చేయరాని క్రియలలో దేనినైనను చేసి
 
11 చేయవలసిన మంచి క్రియలలో దేనినైనను చేయకయుండినయెడల, అనగా పర్వతములమీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరుపుటయు,
 
12 దీనులను దరిద్రు లను భాదపెట్టి బలాత్కారముచేత నష్టము కలుగ జేయు టయు, తాకట్టు చెల్లింపకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేయకృత్యములు జరిగించుటయు,
 
13 అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణ మునకు తానే ఉత్తరవాది యగును.
 
14 అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రిచేసిన పాపములన్నిటిని చూచి, ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకయుండినయెడల, అనగా
 
15 పర్వతములమీద భోజ నము చేయకయు, ఇశ్రాయేలీయులు పెట్టుకొనిన విగ్రహ ములతట్టు చూడకయు, తన పొరుగువాని భార్యను చెరప కయు,
 
16 ఎవనినైనను బాధపెట్టకయు, తాకట్టు ఉంచు కొనకయు, బలాత్కారముచేత నష్టపరచకయు, ఆకలి గలవానికి ఆహారమిచ్చి దిగంబరికి బట్టయిచ్చి
 
17 బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభముకొరకు అప్పియ్యకయు, వడ్డి పుచ్చుకొనకయు నుండినవాడై, నా విధుల నాచరించుచు నా కట్టడల ననుసరించుచు నుండిన యెడల అతడు తన తండ్రిచేసిన దోషమునుబట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రదుకును.
 
18 అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారముచేత తన సహోదరులను నష్టపరచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమునుబట్టి మరణము నొందును.
 
19 అయితే మీరుకుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయుటలేదని చెప్పుకొను చున్నారు. కుమారుడు నీతిన్యాయముల ననుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవ శ్యముగా బ్రదుకును.
 
20 పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.
 
21 అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మర ణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.
 
22 అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.
 
23 దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
 
24 అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరి గించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.
 
25 అయితేయెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి, నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అన్యాయమైనది?
 
26 నీతి పరుడు తన నీతిని విడిచి పాపము చేసినయెడల అతడు దానినిబట్టి మరణము నొందును; తాను పాపము చేయుటనుబట్టియేగదా అతడు మరణమునొందును?
 
27 మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరి గించిన యెడల తన ప్రాణము రక్షించుకొనును.
 
28 అతడు ఆలోచించుకొని తాను చేయుచువచ్చిన అతిక్రమక్రియ లన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రదుకును.
 
29 అయితే ఇశ్రాయేలీయులుయెహోవా మార్గము న్యాయముకాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు.
 
30 కాబట్టి ఇశ్రాయేలీయు లారా, యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణ ములు కాకుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి.
 
31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్దియు తెచ్చుకొనుడి. ఇశ్రా యేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
 
32 మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
 
 

  [ Prev ] 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | [ Next ]