Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
Genesis
ఆదికాండము
Exodus
నిర్గామకాండము
Leviticus
లేవీకాండము
Numbers
సంఖ్యాకాండము
Deuteronomy
ద్వితియోపదేశకాండము
Joshua
యెహోషువ
Judges
న్యాయాధిపతులు
Ruth
రూతు
1 Samuel
1 సమూయేలు
2 Samuel
2 సమూయేలు
1 Kings
1 రాజులు
2 Kings
2 రాజులు
1 Chronicles
1 దినవృత్తాంతములు
2 Chronicles
2 దినవృత్తాంతములు
Ezra
ఎజ్రా
Nehemiah
నెహెమ్యా
Esther
ఎస్తేరు 
Job
యోబు
Psalms
కీర్తనలు
Proverbs
సామెతలు
Ecclesiastes
ప్రసంగి
Song of Solomon
పరమగీతము
Isaiah
యెషయా
Jeremiah
యిర్మియా
Lamentations
విలాపవాక్యములు
Ezekiel
యెహేజ్కేలు
Daniel
దానియేలు
Hosea
హోషేయా
Joel
యోవేలు
Amos
ఆమోసు
Obadiah
ఓబద్యా
Jonah
యోనా
Micah
మీకా
Nahum
నహూము
Habakkuk
హబక్కూకు
Zephaniah
జెఫన్యా 
Haggai
హగ్గయి
Zechariah
జెకర్యా
Malachi
మలాకీ 
Matthew
మత్తయి
Mark
మార్కు
Luke
లూకా 
John
యోహాను
Acts
అపో. కార్యములు
Romans
రోమీయులకు
1 Corinthians
1 కోరింథీయులకు 
2 Corinthians
2 కోరింథీయులకు
Galatians
గలతియులకు
Ephesians
ఎఫెసీయులకు
Philippians
ఫిలిప్పీయులకు
Colossians
కొలస్సీయులకు
1 Thessalonians
1 థెస్సలొనికయులకు 
2 Thessalonians
2 థెస్సలొనికయులకు
1 Timothy
1 తిమోతికి
2 Timothy
2 తిమోతికి
Titus
తీతుకు
Philemon
ఫిలేమోనుకు
Hebrews
హెబ్రీయులకు
James
యాకోబు
1 Peter
1 పేతురు
2 Peter
2 పేతురు
1 John
1 యోహాను
2 John
2 యోహాను
3 John
3 యోహాను
Jude
యూదా
Revelation
ప్రకటన గ్రంథం
 
 

 
 
translate into
ఎఫెసీయులకు Chapter4
 
1 కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు,
 
2 మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణవినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని,
 
3 ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను.
 
4 శరీర మొక్కటే, ఆత్మయు ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
 
5 ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,
 
6 అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు.
 
7 అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను.
 
8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది.
 
9 ఆరోహణమాయెననగా ఆయన భూమియొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థమిచ్చు చున్నదిగదా.
 
10 దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలము లన్నిటికంటె మరి పైకి ఆరోహణమైన వాడునై యున్నాడు.
 
11 మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కువ ూరునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,
 
12 అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.
 
13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.
 
14 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడినప్రతి
 
15 ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
 
16 ఆయన శిరస్సయి యున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చ బడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది.
 
17 కాబట్టి అన్యజనులు నడుచుకొనునట్లు మీరికమీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను.
 
18 వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సు నకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు.
 
19 వారు సిగ్గులేనివారైయుండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మునుతామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి.
 
20 అయితే మీరు యేసునుగూర్చి విని,
 
21 ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడినవారైనయెడల, మీరాలాగు క్రీస్తును నేర్చుకొన్నవారుకారు.
 
22 కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని
 
23 మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై,
 
24 నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింప బడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను.
 
25 మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.
 
26 కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.
 
27 అపవాదికి చోటియ్యకుడి;
 
28 దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.
 
29 వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
 
30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
 
31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
 
32 ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
 
 

  [ Prev ] 1 | 2 | 3 | | 5 | 6 | [ Next ]