Bible-Server.org  
 
 
Praise the Lord, all ye nations      
Psalms 117:1       
 
enter keywords   match
 AND find keywords in

Home Page
Genesis
ఆదికాండము
Exodus
నిర్గామకాండము
Leviticus
లేవీకాండము
Numbers
సంఖ్యాకాండము
Deuteronomy
ద్వితియోపదేశకాండము
Joshua
యెహోషువ
Judges
న్యాయాధిపతులు
Ruth
రూతు
1 Samuel
1 సమూయేలు
2 Samuel
2 సమూయేలు
1 Kings
1 రాజులు
2 Kings
2 రాజులు
1 Chronicles
1 దినవృత్తాంతములు
2 Chronicles
2 దినవృత్తాంతములు
Ezra
ఎజ్రా
Nehemiah
నెహెమ్యా
Esther
ఎస్తేరు 
Job
యోబు
Psalms
కీర్తనలు
Proverbs
సామెతలు
Ecclesiastes
ప్రసంగి
Song of Solomon
పరమగీతము
Isaiah
యెషయా
Jeremiah
యిర్మియా
Lamentations
విలాపవాక్యములు
Ezekiel
యెహేజ్కేలు
Daniel
దానియేలు
Hosea
హోషేయా
Joel
యోవేలు
Amos
ఆమోసు
Obadiah
ఓబద్యా
Jonah
యోనా
Micah
మీకా
Nahum
నహూము
Habakkuk
హబక్కూకు
Zephaniah
జెఫన్యా 
Haggai
హగ్గయి
Zechariah
జెకర్యా
Malachi
మలాకీ 
Matthew
మత్తయి
Mark
మార్కు
Luke
లూకా 
John
యోహాను
Acts
అపో. కార్యములు
Romans
రోమీయులకు
1 Corinthians
1 కోరింథీయులకు 
2 Corinthians
2 కోరింథీయులకు
Galatians
గలతియులకు
Ephesians
ఎఫెసీయులకు
Philippians
ఫిలిప్పీయులకు
Colossians
కొలస్సీయులకు
1 Thessalonians
1 థెస్సలొనికయులకు 
2 Thessalonians
2 థెస్సలొనికయులకు
1 Timothy
1 తిమోతికి
2 Timothy
2 తిమోతికి
Titus
తీతుకు
Philemon
ఫిలేమోనుకు
Hebrews
హెబ్రీయులకు
James
యాకోబు
1 Peter
1 పేతురు
2 Peter
2 పేతురు
1 John
1 యోహాను
2 John
2 యోహాను
3 John
3 యోహాను
Jude
యూదా
Revelation
ప్రకటన గ్రంథం
 
 

 
 
translate into
1 సమూయేలు Chapter9
 
1 అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీ నీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యా మీనీయుడు.
 
2 అతనికి సౌలు అను నొక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యముగల ¸°వనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరు డొకడునులేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తు గలవాడు.
 
3 సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచిమన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్దభములను వెదకుమని చెప్పెను.
 
4 అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషాదేశమున సంచరింపగా అవి కన బడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు.
 
5 అయితే వారు సూపు దేశమునకు వచ్చి నప్పుడుమనము తిరిగి వెళ్లుదము రమ్ము, గార్దభముల కొరకు చింతింపక, నా తండ్రి మనకొరకు విచారపడు నేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా
 
6 వాడుఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.
 
7 అందుకు సౌలుమనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొని పోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరి పోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసి కొనిపోవుటకు మన కేమియు లేదు అని తన పనివానితో చెప్పిమనయొద్ద ఏమి యున్నదని అడుగగా
 
8 వాడు సౌలుతోచిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.
 
9 ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శియనిపించుకొనెను. పూర్వము ఇశ్రా యేలీయులలో దేవునియొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరినయెడలమనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవు దము రండని జనులు చెప్పుకొనుట వాడుక.
 
10 సౌలునీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా
 
11 వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లుచేదుకొను టకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడుఇక్కడ దీర్ఘ దర్శియున్నాడా అని అడిగిరి.
 
12 అందుకు వారుఇదిగో అతడు మీ యెదుటనే యున్నాడు, త్వరగా పోయి కలిసికొనుడి; యీ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నతస్థలమందు జనులకు బలి జరుగును గనుక
 
13 ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.
 
14 వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను.
 
15 సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూ యేలునకు తెలియజేసెను.
 
16 ఎట్లనగానా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి యున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.
 
17 సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవాఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.
 
18 సౌలు గవినియందు సమూయేలును కలిసికొనిదీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా
 
19 సమూయేలు సౌలుతోనేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, నేడు మీరు నాతో కూడ భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్న దంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను.
 
20 మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది? నీ యందును నీ తండ్రి యింటి వారియందును గదా అనెను.
 
21 అందుకు సౌలు నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటి వారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.
 
22 అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి
 
23 పచనకర్తతోనేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా
 
24 పచనకర్త జబ్బను దాని మీదనున్న దానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెనుచూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచ బడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడభోజనముచేసెను,
 
25 పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీదనుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడు చుండెను.
 
26 మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలుమిద్దెమీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి
 
27 ఊరి చివరకు వచ్చు చుండగా సమూయేలు సౌలుతోమనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచి యుండుమనెను; అంతట వాడు వెళ్లెను.
 
 

  [ Prev ] 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | [ Next ]